హలో ఫ్రెండ్స్ గుడ్ డే అందరికి
నా పేరు శ్రీనివాస్. నా వయసు 57 సవంచరులు. నేను ప్రస్తుతము జాంనగర్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లో పని చేస్తున్నాను. నా కంపెనీ పేరు సి ర్ ఆసియ. ఈ కంపెనీ సర్వీస్ ఓరియెంటెడ్ కంపెనీ.
రోజు ప్రోదిన్నె 7.30 కి బయలుదేరుతాం. గంటసేపు ప్రయాణం, కొన్ని సార్లు మీము చదువుకుంటూ, పాటలువింటూ సమయాన్ని గడిపేశాతం. ఆఫీస్ కి వెళ్లిన తరువాత అందరి లగే పని ప్రారంభం, నెలలో 25 రోజులు తలా కృడుట పడితే కానీ పని జరగదు. కొంపలు ముంచుకునే అంట పని వచ్చేస్తుంది ఎక్కడినుంచో తెలియదు, కానీ ఆ పని ఏమిటిఅంటే ఏమి లేదు, చిన్న విషయాన్ని గోరంత కొండతగా చూపించి అనవసరంగా సమయాన్ని వృధా చేస్తారు. నిజంగా చుస్తే అసలు పని అవ్వదు, సాయంత్రమ్ ఏం పని చేసావురా అంటే ఏమి లేదు, వెళ్లేముందు మా బాస్ వస్తాడు సర్ యమ పని చేసేరు అని అడుగుతాడు ఏం చెప్పాలో తెలియక జరిగిన పనిని వివరిస్తాం కానీ ఆయన చెప్పిన పని కంప్లీట్ అవకపోతే మొదలవుతుంది అసలు కదా అక్కడే. రోజులో పని చేసిన పని అంట వృధాగా పోతుంది. ఇది విచిత్రమైన కదా, అసలు ఏమిటంటే ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఎక్కడ ఎప్పుడు ఎమూ జరుగుతుందో ఏమి తెలియదు, అంటే పని విషములో XYZ వాళ్ళు వాళ్ళమీద ఏమి రాకుండా మా కంపెనీ వాళ్ళమీద తోసేస్తారు ఇది చేయలేదు అది చేయాలి అని, మరియు వాళ్ళు మా కంపెనీ ఫై అధికారులకు కంప్లైంట్ చేసేసతారు, మా కంపెనీ అధికారులు ఈమియు తెలుసుకోకుండానే మాకు ఫోన్ చేసేసి చివాట్లు పెడతారు ఇంక మా అవస్థను చూడాలి చిరిగిపోయి విస్తరాకు మల్లె ఉంటాము. మా ఫై అధికారులకు తెలుసు కానీ ఈవీడికో ఒక్కడి తిట్లు పడాలిగా వాళ్ళ పైనుంచి ఉకోకురిపైనా తోసేస్తారు. ఒఫ్ఫ్సిలో అందరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటు గోనుగుతూ, తిట్టుకొంటు పోతారు.
ఆఫీసులో కొంతమందికి పని లేక అనవసరంగా వాళ్ళని వీళ్ళని చిన్న చూపు చూస్తూ అనవసరమైన మాటలు అంటూవుంటారు, అవమానపరుస్తారు.
మల్లి మాములే నెక్స్ట్ రోజు మల్లి ఈవిడగానే మొదలవుతుంది, ఈ దిన చర్య అయిపొయింది దీనికి కొంత మంది అలవాటు పడ్డారు. ఎవరినా మల్లి తిడితే ఏది మాములే అని తుడిపేస్తారు, మరి కొందరు నా లాగా భాదపడుతూ కుములి పోతు వుంటారు కానీ మేము కూడా ఏమిచేయ్యలేని పరిస్థితి. కొన్ని సారులు పని మీద విసుగుయేసి ఈ ఉజోగినికి రాజీనామా చేసి అని ఉకోక ఉజ్జగానికి ప్రరమిస్తాము. కానీ నా వయసు అడ్డుపడుతోంది, ఎక్కడి కెళ్లిన మొదట ని వయసు ఏంటని అడుగుతారు, జవాబు విన్నతరువాత అవస్థ ఉంటుంది నిజంగా వాళ్ళు చెప్పే సమాధానము చుస్తే నవ్వాలో తెలియదు ఏడవాలో తిలియదు. తరువాత మాకు ఒకటే మనసుకి వస్తుంది ఏమిటిటంటే 57 వయసులో ఏమి చేయగలవు నిన్ను చేరుచుకొంటే నీకు పెద్ద శాలరీ ఇవ్వాలి, దాని బదులుగా చిన్నవయసు వారిని తీసుకొంటే అదే జీతములో నాలుగురినో ఎదుగురునో తీసుకోవచ్చు. ఈ విషయము విన్న తరువాతా ఎలావుంటుందో తెలుసా నిజంగా ఏం చేయాలో తెలియదు ఎక్కడి వెళ్ళాలి పరిస్థితి. మల్లి అదే కంపెనీ లో తిట్లు తతింటు పని చెయ్యాలి. ఎటు చేస్తే జీతము లేకుండా ఉండలేము ఎందుకంటే మా తండ్రిగారి వయస్సు 89, తమ్ముడి వయసు 55, వాళ్లతోపాటు మా అత్తగారు, మావగారు, విల్లాఅందరిని పోషిచే బాధ్యత నా పై వుడికాబటి నోరుమూసుకుని పని చేసుకుంటూ పోవడమే, సమయము దొరికారినపుడు ఆలోచించుకుంటే ఏది ఏమిటిరా జీవితం అనుకొంటాము, కానీ కొన్ని సార్లు కొంతమందిని అంగవైకలయము వున్నవాడు మరియు అనేక అంగవైల్యాలలోతో జీవిస్తున్న మంది చూసి సద్దుకుపోతేనే జీవితము అని జీవితాన్ని గడిపెస్తున్నాము. ఒక సంతోషాన్ని పంచుకొనలేము చెప్పుకొనలేము అంతేరా జీవితము అంతేరా జీవితము.
No comments:
Post a Comment